హనుమాన్ జయంతి నాడు…తులసీ మాలతో, తమలపాకు లతో మాల దారణ

హనుమాన్ జయంతిని వైశాఖ శుద్ధ దశమినాడు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే.ఈరోజున హనుమంతుని ఎంతభక్తిగా పూజించుకుంటే అంత మేలు జరుగుతుందని ,ఆయన అంతటి బలాన్ని చేకూరుస్తాడని నమ్మకం. అయితే ప్రాచుర్యంలో ఉన్న హనుమంతుని యొక్క జనన రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పురాణ కథల ప్రకారం కుంచిక స్థల అని అప్సరస అంజన అనే వారసకాంతగా జన్మించింది .కేసరి అనే వానరవీరుడు ఆమెని పెళ్లి చేసుకుంటాడు…వారికి పెళ్లి అయినా సంతానం కలగదు…అప్పుడు వారు సంతానం కొరకు భక్తిశ్రద్ధలతో శివుని ఆరాధించడం జరుగుతుంది. వాయుదేవుడు శివుని దేహము పండు రూపంలో అంజనాకు ఇస్తాడు…అంజనకు జన్మించిన అంజన పుత్రుడై మన ఆంజనేయ స్వామి.కేసరి నందన్,ని వాయుదేవుని అనుగ్రహంతో జన్మించినందున వాయు స్తుతుడని కూడా పిలుస్తూ ఉంటారు…సంప్రదాయాన్ని అనుసరించి హనుమంతుని ఉపాసకులు కూడా ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీ.అయితే శ్రీరామనవమితో పాటు కొందరు ఆంజనేయ స్వామి జన్మోత్సవం కూడా జరుపుకోవడం కొన్ని ప్రాంతాల్లో ఆనవాయితి.హనుమాన్ జయంతి నాడు చేయవలసిన ముఖ్యమైన పని అందరికీ తెలిసిన విషయం హనుమాన్ చాలీసా పఠనం.ఈ పఠనం వలన మనకి కలిగే మేలు ఏమిటి ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందా.

కొండంత ధైర్యం ఆ వీరాంజనేయుడు మనను అందిస్తాడని భక్తుల నమ్మకం.పావని మూర్తి అయిన శ్రీరాముడి పరమ భక్తుడు తులసీదాసు ఈ చాలీసాను రచించారు. ఉపవాసదీక్షలో ఉండి ఈ చాలీసాను చదివితే కోరిక కోర్కెలు తీరుతాయి. హనుమాన్ జయంతి నాడు…తులసీ మాలతో లేదా తమలపాకు లతో మాల దారణ చేస్తే అంజనీ పుత్రుడిని ప్రసన్నం చేసుకోవచ్చు….
ఇక సింధూరంతో అభిషేకం చేస్తే విజయం వరిస్తుందని ప్రతీతి. ఆ వీరాంజనేయుని ధైర్యం, బలం చేకూరాలంటే ఈ హనుమాన్ జయంతిని భక్తిశ్రద్ధలతో జరుపుకోండి…