..భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో మహిళల భద్రతకు వాట్సప్ నంబర్
అమరావతి :
ఏపీ రాష్ట్రంలోని మహిళలు, చిన్నారుల భద్రత కోసం పోలీసు విభాగం ‘శక్తి’ పేరుతో 79934 85111 అనే వాట్సప్ నంబర్ను అందుబాటు లోకి తెచ్చింది. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయం లో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా దీన్ని ఆవిష్కరించారు. అత్యవసర, విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ వాట్సప్ నంబర్కు నేరుగా వాయిస్, వీడియో కాల్ లేదా మెసేజ్ రూపంలో ఫిర్యాదు చేయొచ్చునని తెలిపారు.
