భారత్ న్యూస్ విజయవాడ…గూడూరు లో తప్పించుకుని చల్లపల్లిలో దొరికారు
గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను చల్లపల్లి పోలీసులు శనివారం రాత్రి జాతీయ రహదారిపై పట్టుకున్నారు. హైదరాబాద్కు చెందిన శ్రీనివాసరావు, గూడూరుకు చెందిన నాగబాబు 12.5 కేజీల గంజాయిని తరలిస్తుండగా గూడూరు పోలీసులు వెంబడించారు అక్కడ తప్పించుకున్న వీరు అతివేగంగా వెళ్తున్న వారి బైక్ చల్లపల్లి వద్ద అదుపుతప్పి పడిపోవడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.
