కంకిపాడులో 6 కిలోల గంజాయి పట్టివేత చాకచక్యంగా వ్యవహరించిన ఎస్‌ఐ డి. సందీప్ బృందం…

భారత్ న్యూస్ విజయవాడ…కంకిపాడులో 6 కిలోల గంజాయి పట్టివేత చాకచక్యంగా వ్యవహరించిన ఎస్‌ఐ డి. సందీప్ బృందం…
జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు*గారి ఆదేశాల మేరకు మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని సీఐ మురళీ కృష్ణ తెలిపారు.

కంకిపాడు మండల పరిధిలో పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీలలో 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. సీలేరు ప్రాంతం నుంచి కృష్ణాజిల్లాకు గంజాయి తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం అందుకున్న కంకిపాడు ఎస్‌ఐ డి. సందీప్ తన సిబ్బందితో కలిసి పామాయిల్ తోట ప్రాంతంలో ముమ్మర నిఘా ఏర్పాటు చేశారు.

పోలీసుల చాకచక్యమైన చర్యలతో సీలేరుకు చెందిన కిముడు శంకర్‌తో పాటు కృష్ణాజిల్లాకు చెందిన మరో ఐదుగురు నిందితులు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 6 కిలోల గంజాయి, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన ఎస్‌ఐ డి. సందీప్, పోలీసు సిబ్బందిని సీఐ మురళీకృష్ణ ప్రత్యేకంగా అభినందించారు.

Note:
గంజాయి కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించి, పాజిటివ్‌గా తేలిన వారికి కౌన్సిలింగ్ అందిస్తున్నామని, అవసరమైతే డీ-అడిక్షన్ కేంద్రాలకు తరలిస్తున్నామని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల నడవడికపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మూడు నుంచి ఆరు నెలల క్రితం మాదకద్రవ్యాలు సేవించినా ఈ పరీక్షల ద్వారా ఖచ్చితమైన ఫలితాలు తెలుసుకునే అవకాశం ఉందని వివరించారు.

మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్న కంకిపాడు పోలీసుల పనితీరుపై స్థానికులు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.