భర్తను ముక్కలు చేసిన భార్య …

బెంగళూరులో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని అతని భార్య, ఆమె తల్లి కలిసి గొంతుకోసి చంపేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి లోక్ నాథ్ సింగ్ వివాహేతర సంబంధాలు, చట్టవ్యతిరేక పనులే ఈ హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. లోక్ నాథ్ చర్యలకు విసుగుచెందిన అతని భార్య, అత్త పలుమార్లు హెచ్చరించినా వినలేదు. దీంతో అతను తినే ఆహారంలో మత్తు మందు కలిపి నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి గొంతుకోసి చంపేశినట్లు పోలీసులు గుర్తించారు. ఆ శవాన్ని కారులోనే వదిలేసి వెళ్లిపోయారు తల్లీకూతుళ్లు. చిక్కబనవర ప్రాంతంలో శనివారం ఓ కారులో లోక్ నాథ్ సింగ్ మృతదేహాన్ని కనుగొన్న స్తానికులు పోలీసులకు సమాచారం అందించారు. విచారణ చేపట్టిన బెంగళూరు నార్త్ డీసీపీ సైదుల్ అదావత్ తల్లీకూతుళ్లను అరెస్ట్ చేశారు. గతంలో పలు మోసాలకు పాల్పడిన లోక్ నాథ్ సింగ్ మీద బెంగళూరు క్రైం బ్రాంచ్ పోలీసులు కేసులు నమోదు చేశారు.