…భారత్ న్యూస్ హైదరాబాద్….రెండు లారీలు ఢీ.. తప్పిన పెను ప్రమాదం …
ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. హైవేపై వేగంగా వెళ్తున్న లారీ అదుపు తప్పి గ్యాస్ సిలిండర్లు నింపిన లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. హైవేపై చెల్లాచెదురుగా పడి ఉన్న గ్యాస్ సిలిండర్లను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హైవేపై ఉన్న సిలిండర్లను తొలగించారు.