భారత్ న్యూస్ విజయవాడ…ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట బందోబస్తు.

బందోబస్తు ఏర్పాట్లును పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఐపీఎస్.

అప్రమత్తతో, బాధ్యతగా విధులు నిర్వర్తించాలి.

బందోబస్తు విధి నిర్వహణల పై దిశ నిర్దేశాలు చేసిన జిల్లా ఎస్పీ శ్రీ కే.వీ మహేశ్వర రెడ్డి ఐపీఎస్

ఈదుపురం :

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవంబర్ ఒకటో తేదీన ఇచ్చాపురం నియోజకవర్గం, ఈదుపురం గ్రామంలోని పర్యటించనున్నారు.సిఎం పర్యటనకు భద్రత పరమైన ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఐపీఎస్ గురువారం ఉదయం అక్కడే ఉండి ఏర్పాట్లను స్వయంగా పోలీసు అధికారులతో కలిసి పర్యవేక్షించారు.

హెలిప్యాడ్,సభా వేధిక, లబ్ధిదారులు కలయిక తదితర రూట్ మ్యాపును జిల్లా ఎస్పీ స్వయంగా పర్యవేక్షించి అవసరమైన బందోబస్తుని కేటాయించాలని అధికారులను ఆదేశించారు. వాహనాల పార్కింగ్ నకు ప్రత్యేక స్థలాలను కేటాయించి నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశాలలో వాహనాలు పార్కింగ్ చేసే విధంగా చూసి ట్రాఫిక్ అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు.

విధి నిర్వహణలో పాల్గొన్న సిబ్బందికి విధి విధానాలపై ఈదుపురం ఒరియా పాఠశాల వద్ద బ్రీఫింగ్ నిర్వహించిన జిల్లా ఎస్పీ మాట్లాడుతూ బందోబస్తుకు ప్రతి సెక్టార్ లో తగినంత సిబ్బందిని కేటాయించామని, సిబ్బంది అందరూ వారికి కేటాయించిన పాయింట్ల వద్ద వారికి కేటాయించిన సమయానికి హాజరై నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని సూచించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ వెల్లే సమయంలో సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు లేకుండా, ట్రాఫిక్ అంతరాయం లేకుండా, ట్రాఫిక్ మల్లింపు చర్యలు చేపట్టాలని తెలిపారు. సభా ప్రాంగణానికి వచ్చిన వాహనాలను వారికి కేటాయించిన పార్కింగ్ స్థలాల్లో పెట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాలని,. ఇంచార్జి అధికారులు వారి సిబ్బంది�