.భారత్ న్యూస్ హైదరాబాద్…అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ రికార్డులను తనిఖీ చేసిన ఎస్డిపిఓ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ను బుధవారం పాల్వంచ ఎస్డిపిఓ ఆర్ సతీష్ కుమార్ వార్షిక తనిఖీ చేసారు. ఈ తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్ లోని రికార్డులను, క్రైమ్ రికార్డులను తనిఖీ చేసి, పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తగు న్యాయం చేయడానికి అందరూ కృషి చేయాలని పోలీస్ సిబ్బందికి తగు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో సీఐ కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.