భారత్ న్యూస్ విజయవాడ…ఈ రోజు నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., గారు కాన్ఫరెన్స్ హాల్ నందు పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఏడీసీపీలు నుండి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులతో ఏర్పాటు చేసిన ఈ నెల రివ్యూ మీటింగ్ లో ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ల పనితీరును పరిశీలించారు.
ఈ నెల సమీక్షా సమావేశంలో మొదటగా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వారిచే నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రాం ను వివరించి, సిగరెట్ మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం-2003 యొక్క వయిలేషన్స్ నూ,వాటిని అరికట్టే విధానాలను చర్చించి తగు కార్యాచరణ రూపొందించారు.
జి.ఆర్.పి పోలీసులతో చర్చించి రైల్వే స్టేషన్ నందు మరియు స్టేషన్ పరిసర ప్రాంతాలలో గంజాయి ఇతర మాదక ద్రవ్య నివారణతో పాటుగానగర భద్రత తో పాటుగా రైల్వే స్టేషన్ పరిధిలో భద్రతపై, ఇతర అంశాలపై చర్చించి, పలు ప్రతిపాదనలు చేశారు.
ఏ.యూ.టీ.డి & జి.వి.ఎం.సి కలిసి నగరంలో అనాథలు, నిరాశ్రయులను ఆశ్రయం కల్పించే ప్రతినిధితో సమావేశమై నగరం నందు నిరాశ్రయులకు, అనాథలకు ఆశ్రయం కల్పించే విధానాలపై ఉమ్మడిగా చర్చించడం జరిగినది.
మెంటల్ ఆసుపత్రి వైద్యులతో చర్చించి మతిస్థిమితం లేనివారిని, మానసిక వికలాంగులైన పలు కేసులలో బాధితులకు తగు న్యాయం అందించేందుకు తీసుకోవలసిన చర్యలపై, ఇతర అంశాలపై చర్చించారు.
ట్రాకింగ్ ఆఫ్ మిస్సింగ్ చిల్డ్రన్ కోసం నూతనముగా ఏర్పాటు చేసిన మిషన్ వాత్సల్య పోర్టల్ ను వివరించి , సదరు పోర్టల్ ద్వారా ట్రాక్ చేసే విధానం వివరించి, తగు ఆదేశాలను జారీ చేశారు.
నూతనముగా ప్రారంభించబోతున్న నేట్ గ్రిడ్ ఇన్వెస్టిగేషన్ పోర్టల్ ను వివరించి చేదన పూర్తికానీ, పెండింగ్ లో ఉన్న కేసులును త్వరితగతిన చేధించేందుకు తీసుకోవలసిన చర్యలను వివరించి, తగు ఆదేశాలు జారీచేశారు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్, ఆటోమేటిక్ ఈ చలానింగ్ సిస్టమ్ త్రూ, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ , సీసీటీవీ కెమెరాస్ పైలట్ ప్రాజెక్టు నగరంలో ఏర్పాటు చేసే దిశగా ఢిల్లీలో జరిగిన ట్రాఫిక్ ఇన్ఫ్రా టెక్ ఎక్స్పో-2024 నకు హాజరైన అధికారులు ఇచ్చిన పీపీటీ వీక్షించి, నగరంలో అత్యాధునిక పోలీసింగ్ కు ఉపయోగపడే పరికరాలను పరిశీలించి, తదుపరి చర్యలపై ఆదేశాలు జారీచేశారు.
ఇటీవల మన రాష్ట్రంలో జరిగిన డ్రోన్ ఎక్స్పో కు హాజరైన అధికారులతో చర్చించి నగర పోలీసు శాఖకు అవసరమైన డ్రోన్ల పై చర్చించి, తదుపరి చర్యలకు ఆదేశాలు జారీచేశారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఆహ్వానించి పలు న్యాయ సంబంధిత అంశాలపై పరస్పరం చర్చించి, పోలీసు అధికారులు పలు న్యాయ సంబంధిత అంశాలలో తమ సందేహాలను పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ను అడిగి నివృత్తి చేసుకున్నారు.
నగరంలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో యాక్టీవ్ గా ఉన్న రౌడీ షీటర్లు,వారిపై పెడుతున్న నిఘా చర్యలను ఆరా తీశారు, నిన్నటి వరకూ నమోదు చేసిన NDPS కేసు వివరాలను సమీక్షించి, నగరం గుండా ఏటువంటి NDPS రవాణా జరగకుండా పూర్తిగా నిరోధించాలని తెలిపారు.
ట్రాఫిక్, క్రైమ్, లా అండ్ ఆర్డర్ లకు నిర్వహించిన ఈ నెల రివ్యూ మీటింగ్ నందు ఆయా విభాగాల పనితీరును సీపీ గారు పూర్తిగా సమీక్షించారు.
సిపి గారి ఇచ్చిన నంబరు కు వచ్చిన ఫిర్యాదులు ఆధారముగా పలు సమస్యాత్మక ప్రాంతాలను సిపి గారు తెలియజేసి, ఆయా ప్రాంతాలకు సంబంధించిన స్టేషన్ ఎస్.హెచ్.ఓ లతో ఆయా సమస్యలకు పూర్తి అడ్డుకట్ట వేసేలా నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రతీ స్టేషన్ పరిధిలో యెటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా పూర్తిగా నివారించాలని, ఆయా స్టేషన్ పరిధిలో గల నిర్మానుష్యప్రాంతాలను, సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలిస్తూ విజిబుల్ పోలీసింగ్, పీకేట్, అవసరం మేరకు డికొయ్ టీంలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలు పూర్తి అదుపులో ఉండాలనీ, గంజాయి ఎక్కడా ఉండరాదని, ఈవ్ టీజింగ్, ట్రిపుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్ వంటి ఏ స్టేషన్ పరిధిలోనూ చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, అందుకు అదనంగా వెహికల్, మెన్ ఇతర అవసరాలు ఏమైనా ఉన్నచో తనకు తెలియ జేయాలని తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) కార్యక్రమం లో ఫిర్యాధులు స్వీకరిస్తున్న తీరు, విచారణ చేసి పరిష్కరిస్తున్న విధానాలపై పలు ముఖ్య కార్యాచరణలను తెలిపి తక్షణమే ఆచరణలో పెట్టాలని తెలిపారు.
నగరంలో అన్ని పోలీస్ స్టేషన్ల లో కేసులు నమోదు చేస్తున్న తీరు, అధికారులు ఫిర్యాదుదారులతో ప్రవర్తిస్తున్న తీరు పై ఆరా తీసి, తగు ఆదేశాలు జారీ చేశారు.