.భారత్ న్యూస్ హైదరాబాద్….కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసిల్దార్, పంచాయతీ సెక్రెటరీ
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో సిమెంట్ రోడ్ల చెక్కుల చెల్లింపు కోసం లంచం తీసుకుంటూ జైనూర్ తహసిల్దార్, జెండాగుడా కార్యదర్శి ఏసీబికీ పట్టుబడ్డారు. శనివారం జైనూర్ తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ఏసీబీ దాడుల్లో తహసిల్దార్, పంచాయతీ కార్యదర్శిని అరెస్ట్ చేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ డిఎస్పీ రమణ మూర్తి, సీఐ కృష్ణ కుమార్ ఆధ్వర్యంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. జెండాగూడ సీసీ రోడ్లకు సంబంధించిన బిల్లు రూ. 9,10,000 చెక్కులు ఇచ్చేందుకు కేంద్రే సుభోద్ అనే ఒక కాంట్రాక్టర్ దగ్గర 12,000 వేలు లంచం డిమాండ్ చేశారు. ఈ లంచం తీసుకుంటూ జైనూర్ తహసిల్దార్ తిరుపతి, జెండగుడా పంచాయతీ కార్యదర్శి శేఖర్ లు పట్టుబడ్డారు. ఇద్దరీపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డిఎస్పీ రమణమూర్తి వెల్లడించారు.