భారత్ న్యూస్ విజయవాడ…గొల్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధి, సెలపాక గ్రామంలో ఒక మహిళ విషయమై రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు మృతి.
రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణ, రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ కాదు.
కాకినాడ జిల్లా, గొల్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని శలపాక గ్రామంలో ఈరోజు రాత్రి 9 గంటల సమయంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళ విషయమై రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మగ వ్యక్తులు చనిపోయినారు.
ఈ విషయం తెలిసిన వెంటనే కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్, ఐపీఎస్., గారు హుటాహుటిన సంఘటన స్థలమునకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
తదుపరి ఘర్షణలు జరగకుండా కాకినాడ సర్కిల్ సిబ్బందితో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి శ్రీ రఘవీర్ విష్ణు, కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చైతన్య కృష్ణ మరియు కాకినాడ రూరల్ సబ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది సంఘటన స్థలము వద్దకు చేరి, కేసు ధర్యాప్తు మరియు బందోబస్తు చేయుచున్నారు.