లభ్యం కానీ మృతుని ఆచూకీ.
భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్..రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.
లభ్యం కానీ మృతుని ఆచూకీ.
మంగళగిరి మండలం చిన్న కాకాని ఎన్ఆర్ఐ జంక్షన్ జాతీయ రహదారి ఫ్లైఓవర్ పై ఈనెల 20వ తేదీ రాత్రి 8.30 సమయంలో కారును ద్విచక్ర వాహనం టీ కొట్టింది.
ఈ ఘటనలో ద్విచక్ర వాహనం నడుపుతున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.
సమాచారం అందుకున్న మంగళగిరి రూరల్ పోలీసులు మృతదేహాన్ని మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతుని ఆచూకీ తెలిసిన వారు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ ఐ ఫోన్ నెంబర్. 8688831363, కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.