..భారత్ న్యూస్ అమరావతి.జైల్లో బోరుమన్న బోరుగడ్డ అనిల్, ఇకపై ఎలాంటి తప్పు చేయను
వైసీపీ యువ నాయకుడు బోరుగడ్డ అనిల్ కుమార్ ను గుంటూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.దీంతో ఆయనను కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయస్థానం రిమాండ్ విధించింది. తన రాజకీయ భవిష్యత్ మెరుగ్గా ఉండాలంటే ఆనాటి ప్రతిపక్ష నేతలను,టీడీపీ అగ్రనేతలను దూషించాలని కొందరు వైసీపీ నేతలు ఒత్తిడి చేశారని అనిల్ అన్నట్లు తెలిసింది. అందువల్లే తాను అలాంటి మాటలు మాట్లాడినట్లు విచారణలో చెప్పినట్లు సమాచారం. ఇక వైసీపీ హయాంలో నాటి టీడీపీ అధినేత, ప్రస్తుతం సీఎంపై నోటికొచ్చినట్లు తిట్టారన్న అభియోగాలున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం విజయం సాధించడంతో బోరుగడ్డ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.
2021లో కేసు నమోదు…
అరండల్‌పేట ఠాణా పరిధిలో కర్లపూడి బాబూ ప్రకాష్‌ను డబ్బుల కోసం బోరుగడ్డ బెదిరించారని 2021లోనే కేసు నమోదైంది. ప్రస్తుతం దానికి సంబంధించి బుధవారం రాత్రే గుంటూరులోని ఆయన ఇంట్లో నుంచే పోలీసులు అనిల్‌ను అదుపులోకి తీసుకున్నారు.
13 రోజుల రిమాండ్…
అనంతరం గురువారం ఉదయం వైద్య పరీక్షలు చేయించి కోర్టులో హాజరుపర్చారు. దీంతో కోర్టు 13 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు ఆయన్ను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఎవరి ప్రోద్బలంతో అలాంటి మాటలు మాట్లాడారో చెప్పాలని పోలీసులు అనిల్ పై ప్రశ్నల వర్షం కురిపించారు.ఎంత బాగా తిడితే అంత మంచి భవిష్యత్ ఉంటుందని, వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఒకరు ప్రోత్సహించారని బోరుబడ్డ చెప్పారట. కానీ అతను ఎవరో మాత్రం చెప్పలేదని తెలిసింది. దాదాపుగా రెండు గంటల పాటు అనిల్‌కుమార్‌ను అరండల్‌పేట డీఎస్పీ జయంరాంప్రసాద్, పట్టాభిపురం సీఐ వీరేంద్రబాబు, అరండల్‌పేట సీఐ కొంకా శ్రీనివాసరావులు విచారించినట్లు తెలుస్తోంది.
ఇకపై అలాంటి తప్పులు చేయను…
సీఎంగా వైఎస్ జగన్ పరిపాలనలో అక్రమాలకు ఎందుకు పాల్పడ్డావు ? నాటి ప్రతిపక్ష నాయకులను, మహిళలను ఎందుకు అసభ్య పదజాలంతో దూషించావని ప్రశ్నించారట. అజ్ఞాతంలో ఆశ్రయం ఎవరిచ్చారని, ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కడికెళ్లారని పోలీసులు ఆరా తీసినట్లు తెలిసింది. ఇకపై ఎలాంటి తప్పు చేయనని ఆయన వాపోయినట్లు విశ్వాసనీయ సమాచారం.
వాళ్లు తిట్టామంటేనే తిట్టాను…
అప్పట్లో వాళ్ల అండతో అంతలా రెచ్చిపోయానని, ఇప్పుడు ఆయన పార్టీ మారిపోయారట. దీంతో తన బాగోగులు ఎవరూ పట్టించుకోవట్లేదని వాపోయినట్లు సమాచారం. ఇక గుంటూరు జిల్లాలోని వివిధ ఠాణాల్లో అనిల్‌కుమార్‌పై దాదాపుగా 20కిపైగా కేసులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగానూ అనిల్ పై పలు ప్రాంతాల్లో కేసులు ఉన్నాయట. దీంతో పోలీసులు అన్ని ఠాణాలకు సమాచారం పంపినట్లు తెలిపారు..