72 వేల విలువగల ఆరు కేజీల గంజాయి స్వాధీనం ముద్దాయి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలింపు…… పాకాల సి.ఐ కె.మద్దయ్యాచారి

పాకాల (భారత్ న్యూస్ ) తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పోలీస్ స్టేషన్ లో పాకాల సి.ఐ కె.మద్దయ్యాచారి మీడియా సమావేశం గురువారం నిర్వహించారు.ఈ సందర్భంగా పాకాల సిఐ కె.మద్దయ్యాచారి మాట్లాడుతూ ఎస్పి సుబ్బరాయుడు,లాండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పి రవి మనోహరాచారి ఆదేశాలతో చంద్రగిరి డిఎస్పి బేతపూడి బాబు సూచనలతో ప్రస్తుతం గంజాయి రవాణా వాడకం పై ఉక్కుపాదం మోపాలని పేర్కొన్నారు. తమకు అందిన సమాచారం మేరకు పాకాల తహసిల్దార్, పోలీస్ సిబ్బంది పాకాల రైల్వే స్టేషన్ వెళ్లేటప్పటికి ఒక వ్యక్తి ఒక బ్యాగుతో అనుమానంగా బయటికి రావడం జరిగింది.మమ్మల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నం చేయగా వెంటనే చుట్టుముట్టి పట్టుకున్నాము.అతన్ని విచారించగా తన పేరు సర్వన శంకర,సన్నాఫ్ శంకర అని చెప్పాడని సిఐ మద్దయ్యచారి తెలిపారు.ఇతను తమిళనాడు రాష్ట్రం,కడలూరు జిల్లా,సీఎన్ పాల్యం నందలి చొక్కా నాధపాలెం నివాసిగా చెప్పినాడు.తాను విశాఖపట్నం నుండి చెన్నైకి గంజాయి తీసుకుని పోతున్నట్లు చెప్పడం జరిగింది.ఇతను 15000వేలు లీేనా అను వ్యక్తిని వద్దనుండి తీసుకుంటున్నట్లు చెప్పినాడు.
శంకరను అరెస్ట్ చేసి తన వద్ద నుండి ఆరు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు.ఇతని మీద ఇదివరకే తమిళనాడు రాష్ట్రం,కడలూరు జిల్లాలో రెండు గంజాయి కేసులు నమోదయి ఉన్నవని తెలిపారు.పాకాల సి.ఐ కేసు నమోదు చేసి,అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిస్తున్నామని తెలిపారు.గంజాయి వాడకం,అమ్మడం గాని తెలిస్తే మాకు వెంటనే సమాచారం ఇస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.సమాచారం తెలియజేసిన వ్యక్తి వివరాలు బహిర్గతం చేయకుండా గోప్యంగా ఉంచుతామని అన్నారు.