
జగదేకవీరుడు అతిలోకసుందరి.. ఈ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. కరెక్ట్ గా 35 ఏళ్లుకు రీ రిలీజ్ చేయడం.. దీనికి మెగాస్టార్ ప్రమోషన్స్ చేయడంతో అందరిలో ఆసక్తి ఏర్పడింది. దీని కోసం ప్రత్యేకంగా చేసిన ఇంటర్ వ్యూ చేసి రిలీజ్ చేయడంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే.. ఈ ఇంటర్ వ్యూలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మనసులో మాటను బయటపెట్టాడు. తన ప్రశ్నలకు నాగ్ అశ్విన్ సమాధానం చెప్పాలని రిక్వెస్ట్ కాదు.. డిమాండు చేశాడు. మరి.. చరణ్ డిమాండ్ ను నాగ్ అశ్విన్ నెరవేర్చేనా..?
జగదేకవీరుడు అతిలోకసుందరి ఈ సినిమాకి సీక్వెల్ వస్తే.. బాగుంటుందని సినీ అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఇక దర్శకేంద్రుడు, అశ్వనీదత్ ఇద్దరూ కూడా చేయాలని ప్రయత్నించారు కానీ.. వర్కవుట్ కాలేదు. ఈమధ్య శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ తెలుగులో ఎంట్రీ ఇచ్చిన తర్వాత మరోసారి ఈ సీక్వెల్ తెర పైకి వచ్చింది. ఇప్పుడు జగదేకవీరుడు అతిలోకసుందరి స్పెషల్ ఇంటర్ వ్యూలో చరణ్ వీడియో బైట్ లో రెండు ప్రశ్నలు అడిగాడు. అవి ఏంటంటే.. క్లైమాక్స్ లో ఆ ఉంగరం ఏమైంది..? చేప ఏమైంది..? అని అడిగాడు. అంతే కాకుండా.. దీనికి నాగ్ అశ్విన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాడు.
చరణ్ డిమాండ్ ను బట్టి చూస్తుంటే.. ఈ మూవీ సీక్వెల్ కు నాగ్ అశ్విన్ డైరెక్టర్ అయితే బాగుంటుందని చెప్పకనే చెప్పినట్టు తెలుస్తుంది. దీనిని బట్టి తెర వెనుక ఏదో జరుగుతుంది అనిపిస్తుంది. నాగ్ అశ్విన్ ఈ సీక్వెల్ చేస్తానంటే.. చరణ్ నటించడానికి రెడీ.. జాన్వీ కపూర్ కూడా ఖచ్చితంగా ఈ సినిమా చేస్తుంది. ఇక అశ్వనీదత్ ఈ సినిమాని నిర్మించడానికి రెడీగా ఉంటారు. అవసరం అయితే.. దర్శకేంద్రుడు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తారు. అయితే.. నాగ్ అశ్విన్ ప్రస్తుతం ఆలియా భట్ తో ఓ మూవీ చేస్తున్నాడని టాక్. దీని తర్వాత కల్కి 2 చేయాలి. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత ఈ క్రేజీ సీక్వెల్ పై వర్క్ చేస్తాడేమో చూడాలి. ఇదే కనుక జరిగితే.. సంచలనమే.