
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ పాన్ వరల్డ్ మూవీ గురించి గత కొంకాలంగా వార్తలు వస్తున్నాయి కానీ.. అఫిషియల్ అప్ డేట్ మాత్రం రావడం లేదు. రాజమౌళి తన రూటు మార్చి సైలెంట్ గా షూటింగ్ చేసేస్తున్నారు. అయితే..
రాజమౌళి నెక్ట్స్ మూవీ మహా భారతం అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. దీనికి సంబంధించి ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయ్యిందని టాక్ బలంగా వినిపిస్తోంది. మరి.. మహేష్ నెక్ట్స్ ఎవరితో అంటూ కొందరి దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ.. మహేష్ నెక్ట్స్ మూవీ రేసులో ఉన్న ఆ దర్శకులు ఎవరు..?
ఇటీవల మహేష్ బాబు కోసం బుచ్చిబాబు స్టోరీ రెడీ చేశాడని.. స్టోరీ లైన్ చెబితే బాగుంది చేద్దామని మాట ఇచ్చాడంటూ ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. అయితే.. బుచ్చిబాబు ఇప్పుడు తన మనసంతా చరణ్ పెద్ది సినిమా పైనే ఉందట. తనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కథ పై చాన్నాళ్లు వర్క్ చేశాడు. ఇప్పుడు వేరే కథ గురించి ఆలోచించకుండా మొత్తం ఫోకస్ అంతా ఈ సినిమా పైనే పెట్టాడని తెలిసింది. మహేష్, బుచ్చిబాబు కాంబో మూవీ అనేది ఫేక్ న్యూస్ అని.. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని సమాచారం.
మరి.. మహేష్ బాబు నెక్ట్స్ మూవీ ఎవరితో ఉంటుంది అంటే.. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి ఎప్పటి నుంచో మహేష్ తో సినిమా చేయాలి అనుకుంటున్నాడు. ఆమధ్య కథ చెప్పాడు కానీ.. అంత వయొలెన్స్ చేయలేను అంటూ నో చెప్పాడు. ఇద్దరి మధ్య మంచి అనుబంధ ఉంది. అందుచేత ఈ కాంబో సెట్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్ ఉంది.
అలాగే సుకుమార్ మహేష్ తో వన్ నేనొక్కడినే అనే సినిమా చేయడం తెలిసిందే. ఆతర్వాత మళ్లీ ఇద్దరూ కలిసి సినిమా చేయాలి అనుకున్నారు కానీ.. కుదరలేదు. ఇప్పుడు ఈ కాంబో సెట్ అయ్యే ఛాన్స్ ఉందనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఈ ఇద్దరి దర్శకుల్లో ఒకరితో మహేష్ మూవీ ఖచ్చితంగా ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి.. ఏం జరగనుందో చూడాలి.