
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీలో స్పీడు మామూలుగా లేదు. ఆమధ్య వరుసగా నాలుగు సినిమాలను సెట్స్ పైకి తీసుకువచ్చి యంగ్ హీరోలకు సైతం గట్టి పోటీ ఇచ్చారు. ప్రస్తుతం విశ్వంభర మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే.. అనిల్ రావిపూడితో మూవీని పట్టాలెక్కంచడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. చిరు మూవీలో ప్రభాస్ హీరోయిన్ నటించబోతుంది అంటూ ప్రచారం జరుగుతోంది. చిరు ఏ మూవీలో ప్రభాస్ హీరోయిన్ నటించబోతుంది..? ఇంతకీ.. ఆ హీరోయిన్ ఎవరు…?
విశ్వంభర మూవీ తర్వాత చిరు.. అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ నెలాఖరు నుంచి సెట్స్ పైకి రావడానికి రెడీ అవుతోంది. ఇందులో నయనతార, కేథరిన్ నటించబోతున్నట్టుగా తెలిసింది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలను ప్రకటించనున్నారు. మరి.. చిరు మూవీలో నటించే ప్రభాస్ హీరోయిన్ ఎవరంటే.. దీపికా పడుకునే అని సమాచారం. అయితే.. చిరు, అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతోన్న సినిమాలో కాదని.. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించే సినిమాలో అని తెలిసింది.
ఇటీవల చిరు, శ్రీకాంత్ ఓదెల మూవీ గురించి అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. అంతే కాకుండా ఫోటో షూట్ చేసి స్టిల్స్ కూడా రిలీజ్ చేశారు. ఇలా ఫోటోలతో ఈ సినిమాని ప్రకటించినప్పటి నుంచి ఈ మూవీ పై మరింత క్రేజ్ ఏర్పడింది. అయితే.. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ రాణీ ముఖర్జీ నటించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ప్రభాస్ తో కల్కి మూవీలో నటించిన బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే అయితే బాగుంటుంది అనుకుంటున్నారట. త్వరలోనే దీపికను కాంటాక్ట్ చేయనున్నారని టాక్. మరి.. చిరు, దీపికా కాంబో సెట్ అవుతుందో లేదో చూడాలి.