
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన మూవీ దేవర. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా వచ్చి అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే.. ఈ సినిమాకి ముందుగా నెగిటివ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ.. దేవర సినిమా 500 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. అయితే.. ఇంత కలెక్ట్ చేసినా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందని దేవర 2 ఎన్టీఆర్ చేయాలి అనుకోవడం లేదని ఆమధ్య జోరుగా ప్రచారం జరిగింది. అయితే.. ప్రచారంలో ఉన్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టేలా దేవర 2 ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు యంగ్ టైగర్. అనౌన్స్ చేసాడు సరే.. మరి.. అప్ డేట్ ఏంటి..?
ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ రాజీపడకుండా మంచి క్వాలిటీతో నిర్మిస్తుంది. ఈ సినిమా కంటే ముందుగా వార్ మూవీని కంప్లీట్ చేశాడు. ఈ సినిమాను ఆగష్టు 14న విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఫోకస్ అంతా వార్ 2 ప్రమోషన్స్ చేయాలి.. ప్రశాంత్ నీల్ మూవీని కంప్లీట్ చేయాలి. ఈ రెండు సినిమాల మీదే ఉండడంతో దేవర 2 ఎప్పుడు అనేది సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు ఈ సస్పెన్స్ కు తెర దించారని తెలిసింది. విషయం ఏంటంటే.. జులై నుంచి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తారని తెలిసింది.
ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా దేవర 2కు సంబంధించి అప్ డేట్ ఇస్తారట. దీనిని ఓ స్పెషల్ వీడియో రూపంలో ఇవ్వబోతున్నారట. దీనికి సంబంధించి కొరటాల శివ వర్క్ స్టార్ట్ చేసారని తెలిసింది. ఇప్పటికే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ప్రశాంత్ నీల్ తో చేస్తున్న మూవీ స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తారని.. అలాగే వార్ 2 ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు దేవర 2 నుంచి కూడా స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తే.. అభిమానులకు పండగే అని చెప్పచ్చు. ఈ మూవీలో సైఫ్ ఆలీఖాన్ తో పాటు బాబీ డియోల్ ను రంగంలోకి దింపాలి అనుకుంటున్నాడట కొరటాల. మొత్తానికి దేవర 2 ను అంతకు మించి అనేలా ప్లాన్ చే్స్తున్నాడట. మరి.. ఈ మూడు సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తాడేమో చూడాలి.