ఆ నలుగురిలా అఖిల్ బ్లాక్ బస్టర్ సాధించేనా?

అక్కినేని అఖిల్.. కెరీర్ స్టార్ట్ చేయకముందు ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ సాధిస్తాడని అక్కినేని అభిమానులు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. అయితే.. సక్సెస్ సాధించడం కోసం నాలుగోవ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆతర్వాత నుంచైనా వరుసగా సక్సస్ సాధిస్తాడనుకుంటే.. ఏజెంట్ మూవీతో ఊహించని విధంగా డిజాస్టర్ చూడాల్సివచ్చింది. ఏజెంట్ దెబ్బతో రెండేళ్లు సినిమా చేయలేదు. ఇప్పుడు లెనిన్ అంటూ సినిమా చేస్తున్నాడు. అయితే.. ఆ నలుగురు హీరోల్లా అఖిల్ బ్లాక్ బస్టర్ సాధిస్తాడా అనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ.. ఆ నలుగురు ఎవరు..? ఆ నలుగురుకు అఖిల్ లెనిన్ కు సంబంధం ఏంటి..?

అఖిల్ హీరోగా మురళీకృష్ణ అబ్బూరు లెనిన్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ డైరెక్టర్ గతంలో వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమా తీసాడు. లెనిన్ ఈ దర్శకుడికి రెండో సినిమా. అయితే.. ఇది రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రూపొందే సినిమా. ఇటీవల రిలీజ్ చేసిన గ్లింప్స్ లో అఖిల్ స్క్రీన్ ప్రెజెన్స్, రాయలసీమ యాస వావ్ అనిపించేలా ఉన్నాయి. పల్లెటూరు యువకుడుగా అఖిల్ లుక్ ను మార్చిన విధానం అయితే.. అదిరింది. డిఫరెంట్ లవ్ స్టోరీకి డివోషనల్ టచ్ ఇచ్చి.. అందరికీ కనెక్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అఖిల్ సినిమా వచ్చి రెండేళ్లు అవుతుండడంతో సాధ్యమైనంత త్వరగా ఈ ఇయర్ లోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే.. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సినిమా అనగానే బాలయ్య గుర్తొస్తారు. సమరసింహారెడ్డి సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆతర్వాత రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో బాలయ్య చేసిన సినిమాలు అన్నీ సక్సెస్ అయ్యాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవి రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో నటించిన మూవీ ఇంద్ర. అప్పటి వరకు ఉన్న రికార్డులు క్రాస్ చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఎన్టీఆర్ ఆది అంటూ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేసి చిన్న వయసులోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. రీసెంట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప పుష్ప రాజ్ తగ్గేదేలే అంటూ చేసిన సినిమా కూడా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రూపొందిందే. చిరు, బాలయ్య, ఎన్టీఆర్, బన్నీ.. ఈ నలుగురుకు రాయలసీమ బ్యాక్ డ్రాప్ బాగా కలిసొచ్చింది. మరి.. అఖిల్ కు కూడా కలిసొచ్చి లెనిన్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అవుతుందేమో చూడాలి.