సుంకాల ఎఫెక్ట్… దూసుకుపోయిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్‌లకు బ్రేక్ వేస్తున్నట్లు డొనాల్డ్‌ ట్రంప్ ప్రకటించడంతో మార్కెట్లు దూసుకెళ్లాయి. అమెరికా, చైనా మధ్య ఓవైపు సుంకాల పోరు కొనసాగుతున్నా.. మార్కెట్లు మాత్రం భారీ లాభాల్లో ముగిశాయి. అన్ని రంగాల షేర్లో కొనుఓళ్ల మద్దతుతో ప్రధాన సూచీలు బలంగా పుంజుకున్నాయి. సెన్సెక్స్‌ 1310, నిఫ్టీ 429 పాయింట్లు లాభపడ్డాయి. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు 7.72 లక్షల కోట్లు పెరిగి 401.54 లక్షల కోట్లకు చేరింది. ఆసియా, జపాన్ మార్కెట్లు నష్టాలు ఉండగా… షాంఘై, హాంకాంగ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.