
ఇండియాలో టాప్ కార్ల తయారీదారులు తమ కార్లను ఆకట్టుకునే ఆఫర్లతో పాటు పలు రకాల డిస్కౌంట్లలో కస్టమర్లను ఆకర్షించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విభాగంలో అగ్రగామిగా నిలిచిన మారుతీ సుజుకి కూడా కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. మారుతీ కంపెనీకి సంబంధించిన హాట్ సెల్లింగ్ మోడల్స్ లో ఒకటైన ఫ్రాంక్స్ కారుపై అదిరే డిస్కౌంట్లను ప్రకటించింది. ఫ్రాంక్స్ కారుపై ప్రకటించిన లక్ష డిస్కౌంట్స్ లో 35వేలు విలువైన నగదు డిస్కౌంట్ 43వేల విలువైన వెలాసిటీ కిట్ యాక్సెసరీ ప్యాకేజీ 15వేల స్క్రాపేజ్ ప్రయోజనం పదివేల ఎక్స్చేంజ్ బోనస్ ఉన్నాయి. ఈ ఆఫర్ ప్రస్తుతానికి ఏప్రిల్ వరకు మాత్రమే ఉంటుందట…