..భారత్ న్యూస్ అమరావతి..నెల్లూరులో కదంతొక్కిన జనం”
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేలాది మంది నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ
వేలాదిగా తరలివచ్చి, విజయవంతం చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలియజేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉచిత ఇసుక అందిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి, మోసం చేయడాన్ని నిరసిస్తూ, చేపట్టిన ధర్నాకు భారీగా తరలివచ్చి మద్దతు తెలిపిన ప్రజలు.
నెల్లూరు నగరంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించి, ఉచిత ఇసుక అందించాలంటూ నినాదాలతో నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు సాగిన భారీ ర్యాలీలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, నియోజకవర్గ ఇన్చార్జిలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, వేలాదిగా తరలివచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.