..భారత్ న్యూస్ అమరావతి..పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదు: హోం మంత్రి

APలో అత్యాచార ఘటనలపై హోంమంత్రి అనిత బాధ్యత తీసుకోవాలన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆమె స్పందించారు.

ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నారు.

‘శాంతి భద్రతలపై CM, నేను, పోలీసులు ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాం.

వాటిలో పవన్ కళ్యాణ్ భాగమే.

ఆయనకు అన్ని విషయాలు తెలుసు.

ఆయన మాట్లాడిన దాంట్లో ఎలాంటి రాజకీయం లేదు.

పవన్ ఏ కేసు విషయంలో ఆగ్రహంగా ఉన్నారో తెలుసు.

త్వరలో ఆయనతో మాట్లాడుతా’ అని BBCతో అన్నారు.