..భారత్ న్యూస్ అమరావతి.హీరోయిన్తో టాలీవుడ్ హీరో. నారా. రోహిత్ ఎంగేజ్మెంట్లో పాల్గొన్న చంద్రబాబు, భువనేశ్వరి.
తెలుగు హీరో నారా రోహిత్ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ప్రతినిధి-2 మూవీ హీరోయిన్ శిరీష(సిరిలెల్లా)తో రోహిత్ నిశ్చితార్థం జరిగింది. HYD నోవాటెల్లో AP సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, MLA బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యుల మధ్య ఆమె వేలికి ఉంగరం తొడిగారు. వీరి ఎంగేజ్మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. అటు డిసెంబర్లో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం.