భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,నక్సలైట్ లు అంతం అయిపోతారు.. ఆ తరువాత..

సుప్రసిద్ధ ఉర్దూ కథారచయిత ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ 1980లో నక్సలైట్స్ అని ఒక సినిమా తీశారు. సినిమా చివర్లో పెద్ద కాల్పుల సంఘటన తరువాత, పోలీసు అధికారి మెగాఫోన్ పట్టుకుని ‘నక్సలైట్లు ఇంకా ఎవరైనా…

అంతం అయిపోతారు, ఆ తరువాత?
సుప్రసిద్ధ ఉర్దూ కథారచయిత ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ 1980లో నక్సలైట్స్ అని ఒక సినిమా తీశారు. సినిమా చివర్లో పెద్ద కాల్పుల సంఘటన తరువాత, పోలీసు అధికారి మెగాఫోన్ పట్టుకుని ‘నక్సలైట్లు ఇంకా ఎవరైనా మిగిలిపోయారా’ అని గొంతు చించుకుంటూ అడుగుతాడు. నిశ్శబ్దమే సమాధానం. కానీ, అక్కడికి దూరంగా ఒక ఆదివాసీ గూడెంలో చొక్కా కూడా లేని ఒక చిన్న పిల్లవాడు, రెండు చేతులూ ఎత్తుతాడు, తానున్నానన్నట్టు.

అబ్బాస్ ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ అభ్యుదయ ఉద్యమం కాలానికి చెందిన రచయిత. ఆయనకు నక్సలైట్ ఉద్యమంతో పూర్తి ఏకీభావమేమీ లేదు. అవగాహనా లేదు. సినిమాలు తీయడం కూడా ఆయనకు రాదు. అయినా ముగింపు అట్లా ఎందుకు చేసినట్టు? ఉద్యమాలు బలప్రయోగంతో అణగారిపోవు అన్న విశ్వాసం, కొనసాగింపు ఉండి తీరుతుందనే ఆశాభావం, ఆయనకు ఉండవచ్చు.

భారతదేశ గృహమంత్రి అమిత్ షా ఈ మధ్య తరచు మావోయిస్టుల అంతం గురించి చెబుతున్నారు. 2026 అన్న గడువును పదే పదే వక్కాణిస్తున్నారు. ఆయన చెబుతున్నట్టుగానే, ఛత్తీస్‌గఢ్ గహనారణ్యం అబూజ్ మడ్‌లో దళాలు దళాలుగా, గూడేలు గూడేలుగా మనుషులు చచ్చిపోతున్నారు. ఆ చనిపోవడంలో ప్రభుత్వం విజయం చూస్తోంది. తెగిపడిన తలలను, తెగవలసిన తలలను లెక్కపెట్టి మరీ చెబుతోంది. త్వరలోనే అంతా ముగిసిపోతుంది అన్న భరోసాను ప్రకటిస్తోంది. నాలుగువేల చదరపు కిలోమీటర్ల అరణ్యంలో కొత్త అభివృద్ధిని కలగంటోంది.

కొత్త సమాజాన్ని నిర్మిస్తామని తుపాకులు పట్టుకుని పోరాటం చేస్తున్నవాళ్లు మన మధ్య ఆరున్నర దశాబ్దాలుగా కనిపిస్తున్నారు. వాళ్లంతా, ఈ సమాజం కడుపులో నుంచి పుట్టినవాళ్లే. ఈ ప్రజల కన్నబిడ్డలే. పెద్ద ఎత్తున జనాన్ని కూడగట్టి, ఉద్యమాలు చేసి, అంతిమంగా భారత రాజ్యాన్నే పట్టుకోవాలన్నది వాళ్ల వ్యూహం. సహజంగానే ప్రభుత్వాలూ, వ్యవస్థా దాన్ని సహించవు. సాయుధంగా ఉన్నారన్న కారణం ఉంటుంది కనుక, చాటుమాటుగా తిరుగుతుంటారు కనుక వాళ్లను చంపేయడానికి ప్రభుత్వ భటులకు చాలా సులువులు ఉంటాయి. చట్టప్రకారం వెళ్లడం, విచారణ తతంగాలూ ఇటువంటివాళ్ల విషయంలో అనవసరమని భద్రతావ్యవస్థలు నమ్ముతాయి. ఫలితంగా, వేలాదిమంది నక్సలైట్లు నిర్మూలన అయ్యారు. అదే సమయంలో వేలాదిమంది కొత్తగా పుట్టుకువచ్చారు. ఇప్పుడు ఈ పునరావృత చట్రంలో నిర్మూలనదే పైచేయి అయిందని, ఇక అంతా చదును కాబోతోందని ప్రభుత్వం ఆనందిస్తోంది.

నిజానికి, నక్సలైట్లతోనే మొదలు కాదు. అంతకు ముందు కమ్యూనిస్టులు ఉన్నారు. తెలంగాణతో సహా దేశంలోని అనేక భాగాల్లో తుపాకుల పోరాటం వాళ్లు చేశారు. అంతకు ముందు భగత్ సింగ్, అల్లూరి వంటి విప్లవవాదులు ఆయుధాలు పట్టుకుని బ్రిటిష్ వారి మీద పోరాడారు. 1857లో భారత రైతాంగం, సైనికులు తిరుగుబాటు చేసి, పోరాడి అణగారిపోయారు. అయినా, ఆ తరువాత పోరాటాలు పుడుతూనే వచ్చాయి. స్వతంత్రం వచ్చిన సమయంలోను, ఆ తరువాత, కమ్యూనిస్టులు, నక్సలైట్లు కాని వారు కూడా చాలా చోట్ల సాయుధ పోరాటాలు చేశారు, చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో అనేక సాయుధ సంస్థలు క్రియాశీలంగా ఉన్నాయి. కొన్నిటితో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది, ఒప్పందాలు కూడా చేసుకుంది. ఒప్పందాలు చేసుకున్న చోట కూడా కొందరు తిరుగుబాటు దారులు వాటిని ఒప్పుకోక, పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. సంస్థలు అంతమైపోవచ్చు, కొన్నిచోట్ల పోరాటాలు మౌనంలోకి పోవచ్చు, ముగిసిపోతాయని చెప్పలేము.

కొలంబియాలో గెరిల్లా ఉద్యమం మాఫియాగా మారి, చివరకు లొంగిపోయింది కదా, శ్రీలంకలో టైగర్లను తుడిచిపెట్టారు కదా, మన దేశంలోనూ ఖలిస్తాన్ ఉద్యమం ఉపశమించింది కదా, నేపాల్‌లో మావోయిస్టులు అణగారిపోయారు కదా అని వాదనలు వింటుంటాము. పై ఉదాహరణల్లో ఎక్కడా సమస్య శేషం లేకుండా పోలేదు. కొత్తరూపాల్లో అశాంతి వ్యక్తమవుతోంది. ఒక చారిత్రక జ్ఞాపకంగా కూడా ఆయా ఉద్యమాలు వర్తమాన రాజకీయాల్లో కీలకపాత్ర వహిస్తున్నాయి. ఎందుకంటే, ఎందువల్ల అక్కడ సాయుధ రాజకీయాలు వచ్చాయో, ఆ మూలకారణాలు సమసిపోలేదు. ఎక్కడైనా సమస్య లేకుండా పోయి ఉంటే గనుక, అక్కడ ఉభయపక్షాల అంగీకారంతో, పోరాటవాదుల డిమాండ్లను గణనీయంగా నెరవేర్చడంతో మాత్రమే జరిగింది.

1990 దశకం మొదట్లో, సోవియట్ యూనియన్ కకావికలు అయిపోయినప్పుడు, పెట్టుబడిదారీ ప్రపంచం బహిరంగంగా సంబరపడింది. మేధావులు అయితే, చరిత్ర ఇక ముగిసిపోయింది అన్నారు. అప్పుడు ఒక అంతర్జాతీయ జర్నలిస్టు తన కాలమ్‌లో కొన్ని ప్రశ్నలు వేశారు. ‘‘అయితే ఏమిటి? లోకంలో మనుషులు ఉన్నదానితో సంతృప్తిపడతారా?