..భారత్ న్యూస్ అమరావతి..ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ నందు మొట్టమొదటి సారిగా సిబ్బంది సంక్షేమానికి మొదటి ప్రాధాన్యం ఇస్తూ నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రాత బాగ్చి, ఐ.పి.ఎస్., గారు, విశాఖ కమిషనరేట్ నందు కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ పదోన్నతి పొందిన సిబ్బందిని సత్కరించి, పదోన్నతి ర్యాంకులతో పాటుగా పోస్టింగ్ ఆర్డర్ అందజేయు కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం విధితమే
ఈ రోజు నగర పోలీసు కమిషనరేట్ కు చెందిన 01 సీనియర్ అసిస్టెంట్ కు ఆఫీసు సూపరెండెంట్ గా, 01 అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ కు రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ గా, 01 ఆర్ముడ్ రిజర్వ్ హెడ్ కానిస్టేబుళ్ కు అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ గా, 01 ఆర్ముడ్ రిజర్వ్ కానిస్టేబుల్ కు ఆర్ముడ్ రిజర్వ్ హెడ్ కానిస్టేబుళ్ కు పదోన్నతి పొందడం జరిగినది.
సిబ్బంది సంక్షేమం కోసం ప్రత్యేక ప్రాధాన్యం ఎల్లప్పుడూ ఇచ్చే సిపి గారు పోలీసు శాఖ నందు పదోన్నతి పొందిన సదరు నలుగురు సిబ్బందిని వారి కుటుంబ సభ్యులతో పాటుగా నగర పోలీసు సమావేశమందిరం కు ఆహ్వానించి , నూతన పదోన్నతి సంబంధించిన ర్యాంకులను, పోస్టింగ్ ఆర్డర్లను స్వయముగా అందజేశారు , ఈ కార్యక్రమంలో డి.సి.పి-01(ఎల్& ఓ) , డి.సి.పి-02(ఎల్& ఓ) , డి.సి.పి(క్రైమ్స్), ఆర్ముడ్ రిజర్వ్ అధికారులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
నగర పోలీసు తరపున,
విశాఖపట్నం సిటీ.