..భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో మొత్తం ఓటర్లు 4.14 కోట్లు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 4,14,20,395కు చేరింది. ఇందులో పురుషులు
2,03,47,738, మహిళలు 2,10,69,803, థర్డ్ జెండర్ 3,394 మంది ఉన్నారు. ఈ మేరకు కేంద్ర
ఎన్నికల సంఘం ముసాయిదా జాబితాను విడుదల చేసింది.
జనవరి నుంచి కొత్తగా 10,82,841 మంది ఓటర్లు చేరారు. నవంబర్ 9, 10, 23, 24 తేదీల్లో అభ్యంతరాలు స్వీకరించి, వచ్చే జనవరి 6న తుది
జాబితాను ఈసీ ప్రచురించనుంది.