భారత్ న్యూస్ విజయవాడ..విషసర్పాల నడుమ ఉన్నత పాఠశాల ప్రాంగణం

బడికి వెళ్ళాలన్నా పంపాలన్నా విద్యార్థులకు వారి తల్లితండ్రులకు నిత్యం భయం భయంగా ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణ దుస్థితి

తూర్పుగోదావరి జిల్లా.. దేవరపల్లి మండలం యర్నగూడెం
శ్రీబొల్లిన గంగరాజు జడ్పీ హైస్కూల్ఆవరణ తుప్పలు పొదలతో నిండి ఉండడంతో విషసర్పాలకు ఆవాలమై అవి తరచూ విద్యార్థులకు ఆటగాళ్లకు దర్శనమిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి

అంగన్వాడీ కేంద్రం నుండి జూనియర్ కళాశాల వరకూ విద్యను అందించే విద్యాలయ కూడలిలో చిన్నారులనుండి బాలబాలికల వరకూ 6వందలమంది విద్యాభ్యాసన చేస్తుండగా ఐదు పదుల సంఖ్యలో బోదకులు బోధనారేతరులు విధులు నిర్వహిస్తుంటారు

స్కూల్ దక్షిణాన ఉన్న చెరువు ముంపు మరియు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక పోవడం ఆక్రమణలు అవగాహన నాణ్యత లేని కట్టడాల నిర్మాణం తదితర కారణాల వల్ల సువిశాలమైన స్కూల్ ప్రాంగణం ఆరోగ్యకరమైన క్రీడా ప్రాంగణం నీరు నిలచి తుప్పలతో అడవిని తలపిస్తూ విష సర్పాలకు ఆవాసంగా మారింది

నడవాలంటే భయం టాయిలెట్ కు వెళ్లాలంటే భయం ఆడుకోవాలంటే భయం భయం గుప్పిట్లో భావి భారత పౌరులు….

గ్రామనడి బొడ్డున వివేకంతో జాతికి విజ్ఞానం అందించేందుకు విజ్ఞాన ప్రదాతలైన విజ్ఞులు దాతలు అందించిన స్కూల్ ప్రాంగణం సంరక్షించు కోవాల్సిన బాధ్యత సమాజానిదే

తమవంతు కృషి చేస్తూ ముందుకు సాగుతున్న వివేక సంపన్నులకు కొదువ లేదనేది అక్షర సత్యం

ప్రభుత్వాలు నిధులు కేటాయించడం వాటికి తోడ్పాటుగా పూర్వ విద్యార్థులు గ్రామస్తులు స్వచ్ఛంద సంస్థలు సహకరించడం ఇందుకు నిదర్శనం

ఆదిశగా అంబేద్కర్ యూత్ తమవంతు బాధ్యతగా కృషి చేయడం అభినందనీయం

జాతి భవితకోసం తీవ్రమైన ఈసమస్యకు శాశ్వత పరిష్కారం కోసం సత్వరమే నాయకులు అధికారులు గ్రామస్తులు ఐక్యతగా కృషి చేయవలసిన పరిస్థితి

మరెందుకు ఆలస్యం…
ఇపుడు కాక మరెప్పుడూ….
మనం కాక మరెవ్వరు…?