.భారత్ న్యూస్ అమరావతి..వినుకొండ: 5 మంది జూదరుల అరెస్ట్

పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను వినుకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఉప్పరపాలెం సమీపంలో గురువారం రాత్రి జూదం ఆడుతున్నారనే సమాచారం మేరకు సీఐ శోభన్ బాబు ఆదేశాలతో పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు రూ.17 వేల నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సమిర్ బాషా తెలిపారు.