.భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో మరో రెండు బీసీ గురుకులాలు

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 107 బీసీ గురుకులాలు ఉండగా మరో రెండు కొత్త గురుకులాలను ప్రభుత్వం
అందుబాటులోకి తెస్తోంది.

శ్రీసత్య సాయి జిల్లా రాంపురం (పెనుకొండ), నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అద్దె భవనాల్లో వీటిని ప్రారంభించనుంది.

5, 6, 7, 8 తరగతుల విద్యార్థులతో 240 సీట్లను కేటాయించింది.

పెనుకొండలో సీట్ల భర్తీ పూర్తయ్యింది. ఆత్మకూరులో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది.