భారత్ న్యూస్ అమరావతి.PM Modi: హ్యాట్రిక్ ఇచ్చిన హర్యానా ప్రజలకు మోదీ హ్యాట్సాఫ్
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో (Haryana Assembly Election Results) బీజీపీ (BJP)కి స్పష్టమైన మెజారిటీ ఇచ్చినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామని మరోసారి భరోసా ఇచ్చారు. మంగళవారం వెలువడిన హర్యానా ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 48 సీట్లు కైవసం చేసుకుని మెజారిటీకి అవసరమైన 46 సీట్లను సునాయాసంగా దాటింది. దీంతో పార్టీ శ్రేణుల్లో సంబరాలు వెల్లవెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో హర్యానా ప్రజలకు సామాజిక మాధ్యమంలో వరుస పోస్టుల్లో మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
”భారతీయ జనతా పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వడం ద్వారా హర్యానా ప్రజలు మరోసారి తమ సత్తాను చాటుకున్నందుకు కృతజ్ఞతలు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకంజ వేసే ప్రసక్తి లేదని భరోసా ఇస్తున్నాను” అని మోదీ ట్వీట్ చేశారు. మరో ట్వీట్‌లో ఇంతటి ఘన విజయానికి అంకితభావంతో అవిశ్రాంతంగా కృషి చేసిన పార్టీ కార్యకర్తలందరికి ఆయన అభినందలు తెలియజేశారు. పార్టీ అభివృద్ధి ఎజెండాను కార్యకర్తలు ఇంటింటికి తీసుకువెళ్లడం కూడా పార్టీ విజయానికి ఒక కారణమని ప్రశంసించారు.
