..భారత్ న్యూస్ అమరావతి..నవంబర్ 1వ తేదీన శ్రీకాకుళం జిల్లాకు రానున్న చంద్రబాబు నాయుడు

ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ పధకాన్ని సోంపేట నుంచి ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

శ్రీకాకుళం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవంబర్ 1వ తేదీన శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పర్యటనకు రానున్నారు. పర్యటన ఏర్పాట్లకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జిల్లా అధికారులకు సమాచారం వచ్చినట్లు ఆదివారం తెలిపారు.

శుక్రవారం ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకార్యక్రమాన్ని ఇచ్ఛాపురం నియోజకవర్గం లోని సోంపేటలో ప్రారంభించ నున్నారు.సీఎం పర్యటన సభాస్థలిని పరిశీలించేందుకు ఎమ్మెల్యే బెందాళం అశోక్, ఇన్ఛార్జి ఆర్డీవో కృష్ణమూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు.