భారత్ న్యూస్ అమరావతి..వంటగ్యాస్ రాయితీ పొందాలంటే రేషన్ కార్డు, ఆధార్, గ్యాస్ కనెక్షన్ తప్పనిసరి.

కుటుంబ సభ్యులలో ఎవరి పేరుమీద కనెక్షన్ ఉందో.. ఆ వ్యక్తి పేరు రేషన్ కార్డులో ఉంటే రాయితీ వస్తుంది.

భార్య పేరుతో రేషన్ కార్డు, భర్త పేరుతో గ్యాస్ కనెక్షన్ ఉన్నా అర్హులే.

ఒక రేషన్ కార్డులోని సభ్యుల పేర్లతో రెండు/ మూడు కనెక్షన్లున్నా.. రాయితీ ఒక్క కనెక్షన్ కు వర్తిస్తుంది.

తెదేపా హయాంలో ఇచ్చిన దీపం కనెక్షన్లకూ ‘దీపం 2.0’* పథకం వర్తిస్తుంది.

గ్యాస్ రాయితీ జమ కావాలంటే ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి.

ఆన్లైన్లో లేదా డీలర్ వద్దకెళ్లి బుక్ చేసుకోవచ్చు.

సిలిండర్ అందాక 48 గంటల్లో ఇంధన సంస్థలే రాయితీ సొమ్మును లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తాయి.

సమస్యలుంటే 1967 (టోల్ ఫ్రీ) నంబరుకు ఫోన్ చేయొచ్చు.

గ్రామ/వార్డు సచివాలయాల్లో, తహసీల్దారు కార్యాలయాల్లో పౌర సరఫరాల అధికారుల్ని సంప్రదించవచ్చు.