..భారత్ న్యూస్ అమరావతి..తిరుమలలో 31న వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు: తితిదే

తిరుమల: తిరుమలలో ఈనెల 31న వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేసినట్టు తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. దీపావళి ఆస్థానం దృష్ట్యా వీఐపీ బ్రేక్‌ దర్శనాల రద్దు చేయాలని తితిదే నిర్ణయించింది..

ప్రొటోకాల్‌ ప్రముఖలు మినహా.. సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేశామని, ఈనెల 30న సిఫారసు లేఖలు స్వీకరించబోమని అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని భక్తులకు తితిదే విజ్ఞప్తి చేసింది..