..భారత్ న్యూస్ అమరావతి…అమరావతి:Ammiraju Udaya Shankar.sharma News Editor…
విశాఖలోని శారదాపీఠానికి గత వైకాపా ప్రభుత్వం కేటాయించిన భూములను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా ఈ ఉత్తర్వులు ఇచ్చారు. విశాఖలో రూ.225 కోట్ల విలువ చేసే 15 ఎకరాలను రూ.15 లక్షలకు నాటి వైకాపా ప్రభుత్వం శారదా పీఠానికి కట్టబెట్టింది. ఈ క్రమంలో ఇతర విషయాల్లోనూ నిబంధనల ఉల్లంఘనలు జరిగాయి.
ఎన్డీఏ ప్రభుత్వం గత మంత్రివర్గ సమావేశంలో ఈ భూముల కేటాయింపులను రద్దు చేయాలని తీర్మానించింది. తాజాగా రెవెన్యూ శాఖ జారీ చేసిన అధికారిక ఉత్తర్వులు అనుసరించి అధికారులు తగిన చర్యలు తీసుకోనున్నారు..