భారత్ న్యూస్ విజయవాడ…రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు.. ఇక మీటర్‌కి రీఛార్జ్ చేసుకోవాల్సిందే!

రాష్ట్రంలో మొదటి స్మార్ట్ మీటర్ విశాఖలో ఏర్పాటు తర్వాత.. రాష్ట్రం మొత్తం అమలులో రానున్నది. డబ్బులుంటేనే ఇక ఇంట్లో వెలుగులు,. రీఛార్జ్ చేయకపోతే చీకట్లోనే మగ్గిపోవాలి.

రాష్ట్రంలో మొదటి స్మార్ట్ మీటర్ విశాఖలో ఏర్పాటు తర్వాత.. రాష్ట్రం మొత్తం అమలులో రానున్నది. డబ్బులుంటేనే ఇక ఇంట్లో వెలుగులు,. రీఛార్జ్ చేయకపోతే చీకట్లోనే మగ్గిపోవాలి. రాష్ట్రంలో మొదటి స్మార్ట్ మీటర్‌ను తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ, విశాఖ ప్రజారోగ్య శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఏర్పాటు చేసింది. ఈ స్మార్ట్ మీటర్లను తొలుత ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసి ఆ తర్వాత గృహలకు ఏర్పాటు చేస్తారు.

ఈ మీటర్‌కు మనం ముందుగానే రీఛార్జి చేసుకోవాలి, అందులో బ్యాలెన్స్ ఉన్నత వరకు ఈ స్మార్ట్ మీటర్ నుండి కరెంట్ మన ఇంటికి వస్తుంది. తర్వాత నిర్దాక్షిణ్యంగా కట్ అయిపోతుంది. (మొబైల్ రీచార్జ్ మరియు డిష్ టీవీ లాగా) విద్యుత్ ఎంత వినియోగించింది. వీటి ద్వారా ఎప్పుడైనా తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో రీడింగ్ తీసుకునే అవకాశం వీటి ద్వారా ఉంటుంది. ఎన్నికల ముందు విద్యుత్ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన కూటమి పార్టీలు అవి ఆదోని కంపెనీవి కాబట్టి యుద్ధ ప్రాతిపదికన మీటర్ల బిగించడానికి సిద్ధమవుతున్నది. ఇకనుంచి కరెంటు కావాలంటే ఫోన్ లాగా రీఛార్జ్ ముందే చేసుకోవాలి.