ఏలూరు జిల్లా కైకలూరు:::: 01/12/2024:::: (భారత్ న్యూస్ ) బూత్ కమిటీలు పై దిశా నిర్దేశం చేసిన ఏం.ఎల్.ఎ. కామినేని కైకలూరు ట్రావెల్స్ బంగ్లా క్యాంప్ కార్యాలయము నందు ట్రావెల్స్ బంగ్లా క్యాంప్ కార్యాలయం నందు ఈ రోజు నియోజకవర్గ స్థాయి బీజేపీ పార్టీ నాయకులతో సమావేశంలో పాల్గొని బూత్ కమిటీలపై సమీక్షించిన శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ . ఈ సందర్బంగా కామినేని మాట్లాడుతు రాష్ట్ర బీజేపీ పార్టీ అదేశానుసారం మనకి ఉన్న 235 బూత్ లకు అధ్యక్షులు మరియు 11మంది సభ్యులతో బూత్ కమిటీ వేయాలని నాయకులకు దిశ నిర్దేశం చేసారు.ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు విక్రమ్ కిషోర్,జిల్లా ప్రధాన కార్యదర్శి కోటప్రొలు కృష్ణ,నియోజకవర్గ కార్యదర్శి వేంపాటి విష్ణు,ఎంపీపీ అడవి కృష్ణ , కైకలూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో గల నాయకులు,బిజెపి కుటుంబసభ్యులు,కార్యకర్తలు పాల్గొన్నారు