భారత్ న్యూస్ విజయవాడ…26 నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

ఏపీలో ఈ నెల 26 నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నట్లు టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు.గతంలో
మాదిరిగానే సాధారణ సభ్యత్వ రుసుం రూ.100 గా నిర్ణయించినట్లు తెలిపారు. రూ. 1 లక్ష కట్టిన వారికి
శాశ్వత సభ్యత్వ సదుపాయం ఉంటుందన్నారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి రూ. 5 లక్షల ప్రమాదబీమా కల్పిస్తామన్నారు.