భారత్ న్యూస్ విజయవాడ…విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపడాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొనడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి కేవలం 5 నెలలు మాత్రమే అయింది. 5 నెలల్లోనే ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. అత్యంత దారుణంగా కరెంటు చార్జీల భారాన్ని మోపుతున్నారు. ఇప్పటికే రూ.6 వేల కోట్ల భారం మోపారు. ఇది చాలదు అన్నట్లు ఇంకో రూ.11వేల కోట్లు సిద్ధం చేశారు. మొత్తం రూ.17 వేలకోట్లు సర్దుబాటు కింద మోపుతున్నారు. ప్రజలు ఏం పాపం చేశారు చంద్రబాబు గారు ?
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలపై ఎన్నో హామీలు ఇచ్చారు. వైసీపీ 9 సార్లు ఛార్జీలు పెంచిందని గగ్గోలు పెట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఇది జరిగేది కాదంటూ ప్రగల్భాలు పలికారు. తీరా అధికారంలో వచ్చాకా మాట మార్చారు. మీకు ఓట్లు వేయడం ప్రజలు చేసిన పాపమా ? ప్రతిపక్షంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోరా ? జగన్ మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో రూ.35 వేల కోట్లు భారం మోపితే… మీ 5 నెలల పాలనలో రూ.17 వేల కోట్లు భారమా ? ఇది న్యాయమా చంద్రబాబు ? విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయి అన్నారు. అవకతవకలు జరిగితే చర్యలు తీసుకోవాలి.
గత ప్రభుత్వం వైసీపీ పార్టీ చేసిన పాపానికి ప్రజల మీద భారాన్ని మోపుతారా ? చంద్ర బాబు గారు కేంద్రం నుంచి నిధులు తీసుకురండి. సెంట్రల్ ERC మీ చేతుల్లోనే ఉంది. కేంద్రం నరేంద్ర మోడీ నుంచి నిధులు తెచ్చి విద్యుత్ బిల్లులు మీరే చెల్లించండి. బీజేపీకి గత 10 ఏళ్లుగా ఊడిగం చేస్తున్నారు కదా. బీజేపీకి మద్దతు ఇచ్చిన మీరు నిధులు తేవాలి కదా. ప్రజల నెత్తిన విద్యుత్ భారం వేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. వెంటనే సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలి. ఇప్పటికే సూపర్ సిక్స్ అమలులో ఫెయిల్ అయ్యారు. సంక్షేమ పథకాలు అని చెప్పి… ఒక చేత్త