వైసీపీ జిల్లా అధ్యక్షుడుగా భూమన ప్రమాణ స్వీకార ఏర్పాట్లను భూమనతో కలిసి చెవిరెడ్డి సభా స్థలి పరిశీలన..!

-నవంబర్ 3న తిరుపతిలో భారీ బహిరంగ సభ

-ఏర్పాట్లను పర్యవేక్షించిన ముఖ్య నేతలు

తిరుపతి (భారత్ న్యూస్ ) ఉమ్మడి చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా భూమన కరుణాకర్ రెడ్డిని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించడం విధితమే. ఈ మేరకు ఆయన నవంబర్ 3వ తేదీన పదవీ బాధ్యతల స్వీకారం చేయనున్నారు. తిరుపతి సమీపంలోని 150 అడుగుల జాతీయ రహదారికి ఆనుకుని బహిరంగ స్థలంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈమేరకు శుక్రవారం సాయంత్రం జిల్లా పార్టీ నూతన అధ్యక్షుడు భూమనతో పాటు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్థానిక పార్టీ నేతలతో కలసి సభాస్థలిని పరిశీలన చేశారు.

పార్టీ నేతలు, కార్యకర్తలు తరలి రండి..

ఈనెల 3వ తేదీన వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో జిల్లా నలుమూలల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి పంచాయతీ నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం పరిధిలోని పూతలపట్టు – నాయుడు పేట జాతీయ రహదారికి ఆనుకొని సదరన్ స్పైస్ హోటల్ సమీపంలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆదివారం ఉదయం 9గంటల నుంచి 11గంటల వరకు జరిగే భారీ బహిరంగ సభను విజయ వంతం చేయాలని చెవిరెడ్డి కోరారు.