భారత్ న్యూస్ విజయవాడ..ప్రజల సొమ్ము స్వాహా
చిలకలూరిపేట:ప్రజల సొమ్ముకు రక్షణగా ఉండాల్సిన ఒక బ్యాంకు మేనేజర్ వాళ్ల సొమ్మును చుట్టూ మింగేసాడు. బయట బ్యాంకుల్లో వడ్డీ చాలా తక్కువ కానీ నా బ్యాంకులో ఎక్కువ… రండి త్వరపడండి ఈ అవకాశం ఏ బ్యాంకులో లేదంటూ ఎవ్వడు ముప్పిడిగా డిపాజిట్లు చేయించాడు తన తెలివితేటలతో ఆ ప్రజల డబ్బు అంత తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు ఇంకేముంది ఉష్కా కి…
ఇతని పేరు నరేష్ చంద్రశేఖర్ 2017లో పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్ గా బాధితుల స్వీకరించాడు అప్పటి నుంచి బ్యాంకులో ఉన్న కస్టమర్లతో చాలా సరదాగా క్లోజ్ గా మూవ్ అయ్యేవాడు ఆ సాన్నిత్యం బాగా పెరిగిపోయింది… కస్టమర్లకు బ్యాంకు మేనేజర్ నరేష్ చంద్రశేఖర్ ఉచిత సలహాలు ఇస్తూ ఉండేవాడు మీ దగ్గర డబ్బులు ఉన్నాయా వచ్చి నా బ్యాంకులో డిపాజిట్ చేసుకోండి బయట బ్యాంకులో అయితే మీకు 50 నుంచి60 పైసలు మాత్రమే వస్తుంది.. నా బ్యాంకులో మీరు డిపాజిట్ చేస్తే రూపాయి నుంచి రూపాయి పది పైసల వరకు వడ్డీ ఇస్తాను అంటూ ఇబ్బడి ముబ్బడిగా డిపాజిట్లు సేకరించాడు.. చిలకలూరిపేటలో ఎవరి దగ్గరైనా డబ్బులు బాగా ఉన్నాయని తెలిస్తే వాళ్ళ ఇంటికి నేరుగా వెళ్లి పోయాడు మా బ్యాంకులో డిపాజిట్ చేయండి మీకు అన్ని విధాల బాగుంటుంది మీకు వడ్డీ కూడా ఎక్కువ ఇస్తానంటూ వచ్చిన సొమ్మును డిపాజిట్ చేసే అంతవరకు వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉండేవాడు తీరా డిపాజిట్ చేసిన తర్వాత.. యాప్ ద్వారా ఆన్లైన్లోకి వెళ్లి దాని పైన ఓడి అప్లై చేసేవాడు డిపాజిట్ చేసిన కస్టమర్ల ఫోన్ తీసుకుని ఓటీపీ చూసుకుని వెంటనే ఆ ఓడి ద్వారా వచ్చిన డబ్బులు సొంత ఖాతాలోకి జమ చేసుకునేవాడు. ఇక బ్యాంకుకు డబ్బులు డిపాజిట్ చేసి బాండ్లు తీసుకెళ్లే వారి పరిస్థితి అయితే మరీ దారుణం దీరుగా బ్యాంకు మేనేజర్ నరేష్ చంద్రశేఖర్ తన అకౌంట్ లో డబ్బులు వేయించుకుని నకిలీ బాండ్లు జారీ చేసేవాడు. ఎవరైనా డిపాజిట్లు రెన్యువల్ అయితే ఫోన్ చేసి వారిని ఓటిపి అడిగి ఆ డబ్బును తన ఖాతాలోనికి మళ్ళించుకునేవాడు ఇలా కస్టమర్లకు తెలియకుండా వారి డబ్బంతా కొట్టేసాడు ఇక గోల్డ్ లోన్ వారి పరిస్థితి అయితే మరీ దారుణం గోల్డ్ పెట్టి లోన్ తీసుకున్న కస్టమర్ల వ్యవహారంలో అప్రైజర్స్ తో చేతులు కలిపి వారు బ్యాంకులో తలకాబెట్టిన బంగారం అంతా కొట్టేశారు ఇలా చిలకలూరిపేట ఐసిఐసి బ్యాంకులో నాలుగేళ్ల పాటు పనిచేసిన మేనేజర్ నరేష్ చంద్రశేఖర్ బ్యాంకు డ్యూటీ చేశారు అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ పై నరసరావుపేట వెళ్లారు అక్కడ కూడా ఇలాంటి పరిస్థితి అమలు చేస్తూ కస్టమర్ల డబ్బులు అన్ని కొట్టేశారు. అక్కడినుంచి ప్రమోషన్ పైన విజయవాడ వెళ్లారు అక్కడ జనాన్ని కూడా వదలలేదు ఇదే రకంగా లుటీ చేశారు ఎందుకు అనుమానం వచ్చిన బ్యాంక్ అధికారులు ఒక ఖాతాలో చెక్ చేయడంతో నరేష్ అడ్డంగా దొరికిపోయాడు దీంతో అతన్ని సస్పెండ్ చేశారు ఇదే నేపథ్యంలో చిలకలూరిపేటలో డిపాజిట్ చేసిన వాళ్లంతా తమ ఎకౌంట్లు తాము చేసిన డిపాజిట్లు సొమ్ము కనిపించట్లేదు దీంతో ఆందోళనకు దిగారు
కొంతమంది పిల్లలు చదివించుకోవడానికి డిపాజిట్ చేశారు మరి కొంతమంది పిల్లల పెళ్లి కోసం డిపాజిట్ లో రూపంలో బ్యాంకులో దాచుకున్నారు మరి కొంతమంది వృద్ధాప్యంలో సొమ్ము అక్కరకు వస్తుందన్న భరోసాతో బ్యాంకులో డబ్బులు దాచుకున్నారు కానీ ఈ సొమ్మంతా ఒక పథకం ప్రకారం బ్యాంకు మేనేజర్ తో పాటు ఆయనతో పని చేసే అప్రైజర్ హరీష్లు కొట్టేశారు ఒక చిలకలూరిపేట ఐసిఐసిఐ బ్యాంకులో 90 మందికి పైగా ఖాతాల్లో నగదు మాయమయ్యాయని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దాదాపు 80 కోట్లు పైగా సొమ్మును బ్యాంకు మేనేజర్ కొల్లగొట్టాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనిపైన సిఐడి కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది ఇప్పటికే 72 మంది బాధితులను సిఐడి అధికారులు గుర్తించారు ప్రాథమిక దర్యాప్తులో 27 కోట్లు కొమ్ముకోవడం జరిగిందని అంచనాకు వచ్చారు ఒకవైపు బాధితులను ప్రశ్నిస్తూనే మరొకవైపు 2017 నుంచి బ్యాంకులో ఎవరెవరు పని చేస్తున్నారు. ఎవరెవరితో బ్యాంకు మేనేజర్ కు సంబంధాలు ఉన్నాయి అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు సిఐడి అధికారులు. బ్యాంకు మేనేజర్ మాటలు విని తాము నిండుగా మునిగిపోయామని వెంటనే తమ డబ్బులు తమకు ఇప్పించాలని బాధ్యతలు డిమాండ్ చేస్తున్నారు