భారత్ న్యూస్ విజయవాడ…సుప్రీం కోర్ట్ సంచలన తీర్పు..

*రాజీ కుదిరినా లైంగిక వేధింపుల కేసును కొట్టేయలేం: సుప్రీంకోర్టు..

బాధితులు, నిందితుడు రాజీ కుదుర్చుకున్నప్పటికీ లైంగిక వేధింపుల కేసును రద్దు చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిందితుడికి అనుకూలంగా రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. అతనిపై విచారణను కొనసాగించాలని సుప్రీం కోర్ట్ ఆదేశించింది.

2022లో ఓ టీచర్ పై మైనర్ బాలిక లైంగిక వేధింపుల కేసుపెట్టింది. ఆ తర్వాత వారిమధ్య రాజీ కుదరడం తో FIRను హైకోర్టు రద్దు చేసింది.ఈ తీర్పును ఓ వ్యక్తి సుప్రీంలో సవాల్ చేశారు. ఈ కేసు విషయంలో సుప్రీం కోర్ట్ ఈ సంచలన తీర్పు ఇచ్చింది.