డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అధ్యయన తరగతులు

పాకాల ( భారత్ న్యూస్ ) పాకాల గ్రంథాలయంలో భారత రాజ్యాంగం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి అధ్యయన తరగతులు భాగంగా ఆదివారం రామయ్య ప్రసంగిస్తూ భారత రాజ్యాంగం అన్ని దేశాలకు కూడా ఆదర్శం అయిందని తెలియజేశారు. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి గ్రామీణ పేద ప్రజల సమస్యలను గుర్తించి వాటి సమస్యలు సాధన కోసం కృషి చేయాలని తెలియజేశారు. 36వ ఆర్టికల్ నుంచి 51 ఆర్టికల్ వరకు రాజ్యాంగ చట్టాలను విశదీకరించి తెలియజేశారు. భారత రాజ్యాంగంలోని ప్రవేశ పెట్టిన అంశాలను ప్రతి ఒక్కరికి ఆ ప్రతిఫలాలు అందాలని పిలుపునిచ్చారు డాక్టర్ ఆమూరి సుధాకర్ గారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం పట్ల మేధావులందరూ కూడా ఆలోచించి దేశ విదేశాల్లో కూడా కొనియాడుతున్నారు అన్నారు. ఈ అధ్యయన తరగతులు నేటి సమాజానికి ఎంతగానో ఉపయోగపడతాయని ప్రజలందరూ కూడా పాల్గొని భారత రాజ్యాంగ విలువలను తెలుసుకోవాలి అన్నారు. భారత రాజ్యాంగ సదస్సులు అక్కడక్కడా ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా భారత రాజ్యాంగం యొక్కj విలువలతో తెలియచెప్పాలన్నారు. పాకాల మండల ఎంఈఓ బాబ్జి గారు మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు చాలా వాక్ స్వాతంత్రపు హక్కు, స్వేచ్ఛ స్వతంత్ర హక్కు సమానత్వ హక్కు, మత స్వాతంత్ర హక్కు దోపిడీ నివారణ హక్కు రాజ్యాంగ పరిహారపు హక్కు సాంస్కృత విద్యాహక్కు, నేటి సమాజానికి పొందుపరిచినటువంటి ఈ ప్రాథమిక హక్కులన్నీ కూడా చాలా చక్కగా వినియోగించుకుంటున్నారని తెలియజేశారు. ఆరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గనక రాజ్యాంగం రాయకపోయి ఉండుంటే పేదవారి బ్రతుకు చాలా దీనావస్థలో ఉండేదని తెలియజేశారు. గ్రంథాలయ అధికారుల రవీంద్రబాబు, ఉపాధ్యాయులు ప్రభు, జ్యోతి వెంకటరత్నం,ఉదయ్, సరస్వతమ్మ పాల్గొన్నారు.