..భారత్ న్యూస్ అమరావతి..విజయవాడ…
నారాయణ కాలేజ్ లో ఫీజుల వేధింపులు..
విద్యార్థులు శారీరక ,మానసిక ఒత్తిడి కి గురి.
ప్రభుత్వం వెంటనే స్పందించాలి..
విద్యా చట్టం, చైల్డ్ ప్రొటెక్షన్ ఆక్ట్ ప్రకారం సిబ్బంది, యాజమాన్యంపై కేసులు పెట్టాలి…

ఫీజు కట్టలేదని విజయవాడ నగరం లోని కానూరు శివ భవానీ బ్రాంచ్ అక్రమ అనుబంధ హాస్టల్ 30 మంది ఇంటర్ విద్యార్థు లను రోడ్డుపై నిలబెట్టిన విద్యార్థులను మానసికంగా శారీరకంగా హింసకు గురిచేసిన సిబ్బంది యాజమాన్యాల అమానుష వైఖరిని ఖండిస్తున్నాము

ఒకవైపు చదువుల ఒత్తిడి మరోవైపు ఫీజు కట్టకపోవడంతో అవమానం పిల్లల గురించి ఆందోళన చెందుతున్న తల్లితండ్రులు పరిస్థితి వర్ణనాతీతం.
ఫీజులు చెల్లించని పక్షంలో తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలి తల్లిదండ్రులతో మాట్లాడాలి అందుకు విరుద్ధంగా వ్యవహరించడం హేయమైన చర్య.

నగరంలో ఇంటర్ బోర్డు రాష్ట్ర కార్యాలయానికి చేరువలో ప్రభుత్వ శాఖల మరియు ఇంటర్ బోర్డు అనుమతులు లేకుండా అనుబంధ హాస్టల్ నిర్వహిస్తూ ఫీజుల బకాయిలు ఉన్నారని విద్యార్థులను మానసికంగా, శారీరకంగా హింసకు గురి చేసిన కళాశాల యాజమాన్యంపై సిబ్బందిపై ప్రభుత్వం, ఇంటర్ బోర్డు అధికారులు వెంటనే జోక్యం చేసుకొని విచారణ జరిపి విద్యా చట్టం, చైల్డ్ ప్రొటెక్షన్ ఆక్ట్ ప్రకారం కళాశాల యాజమాన్యంపై కేసులు బనాయించాలని ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తుంది.

ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్
(రిజిస్టర్ నెంబర్ 6/2022)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ.
మలి రెడ్డి కోటా రెడ్డి (అడ్వకేట్ )రాష్ట్ర గౌరవాధ్యక్షులు

నరహరి. యస్ రాష్ట్ర అధ్యక్షులు
జీ.ఈశ్వరయ్య రాష్ట్ర కార్యదర్శి