భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో ధరల స్థిరీకరణ కోసం ప్రత్యేక కమిటీలు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ధరల స్థిరీకరణ కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
రాష్ట్రస్థాయిలో సీఎస్ నీరబ్ కుమార్ చైర్మన్ గానూ, జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్ గానూ, కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఏపీ సర్కార్ వెల్లడించింది.
రాష్ట్రస్ధాయి కమిటీలో 21 మంది సభ్యులు, జిల్లా స్థాయి లో 17 మంది సభ్యులు ఉండనున్నారు.
ఈ కమిటీలు ధరల స్థిరీకరణకు కావాల్సిన అంశాలను ప్రభుత్వానికి సూచించనున్నాయి.