..భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో నవంబర్ నుంచి రేషన్లో కందిపప్పు, పంచదార, జొన్నలు*

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని రేషన్ కార్డ్ దారులందరికీ నవంబరు నుంచి ఉచిత బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, జొన్నలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే అన్ని MLS
పాయింట్లకు సరిపడా సరుకులు రవాణా చేసేలా పౌరసరఫరాలశాఖ చర్యలు తీసుకుంది.

నవంబరు1 నుంచి రేషన్ కార్డు దారులందరికీ రేషన్ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు.

కిలో కందిపప్పు రూ.67కు, అరకిలో పంచదార రూ.17కు అందించేందుకు చర్యలు తీసుకున్నారు.