.భారత్ న్యూస్ అమరావతి..ఆంధ్ర ప్రదేశ్ లో మద్యం షాపుల దరఖాస్తులకు గడువు పొడిగింపు
మద్యం టెండర్ల షెడ్యూల్‌ను మార్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు రావటంతో ఆంధ్ర ప్రదేశ్ లో మద్యం షాపుల దరఖాస్తులకు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దసరా సెలవుల నేపథ్యంలో వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తితో మద్యం టెండర్ల షెడ్యూల్లో మార్పులు చేశారు.
ఈనెల 11 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించారు.ఈనెల 14న మధ్యం షాపులకు అధికారులు లాటరీ తీయనున్నారు. ఈనెల 16 నుంచి కొత్త మద్యం విధానం అమలులోకి రానుంది.