భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్..ఢిల్లీ ఎయిమ్స్‌లో మహిళా గార్డుపై లైంగిక వేధింపులు

Oct 19, 2024,

ఢిల్లీ ఎయిమ్స్‌లో మహిళా గార్డుపై లైంగిక వేధింపులు
ఢిల్లీ ఎయిమ్స్‌లో ఇటీవల షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా గార్డుపై లైంగిక వేధింపుల ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ దిగ్విజయ్ సింగ్‌ తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ మహిళ అక్టోబర్‌ 3న ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు ఆమె ఆరోపణలపై విచారించేందుకు ఇద్దరు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు.