..భారత్ న్యూస్ అమరావతి..ఆంధ్రప్రదేశ్ లో అమెజాన్ డాటా సెంటర్ ఏర్పాటు చేయండి
సులభతరమైన పౌరసేవలకు సహకారం అందించండి
అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎండి రేచల్ స్కాఫ్ తో మంత్రి లోకేష్ భేటీ
అమెరికాలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల జైత్రయాత్ర కొనసాగుతోంది.
లాస్ వెగాస్ లో ఐటి సర్వ్ సినర్జీ సదస్సుకు హాజరైన మంత్రి లోకేష్ అక్కడి ప్రాంగణంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) మేనేజింగ్ డైరక్టర్ రేచల్ స్కాఫ్ ను కలిసి ఎపిలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తిచేశారు.