భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,వీఐపీల భద్రత వీధుల నుంచి ఎన్‌ఎస్‌జీ కమాండోల ఉపసంహరణ

Oct 17, 2024,

వీఐపీల భద్రత వీధుల నుంచి ఎన్‌ఎస్‌జీ కమాండోల ఉపసంహరణ
వీఐపీల భద్రత విధుల నుంచి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ) కమాండోలను ఉపసంహరిస్తూ కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. దేశంలో భద్రతా పరంగా అధిక ముప్పు కలిగిన 9 మంది వీఐపీల వద్ద వారు విధుల్లో ఉన్నారు. కాగా నవంబర్‌ నుంచి ఆ 9 మంది హై-రిస్క్‌ వీఐపీల భద్రతను సీఆర్‌పీఎఫ్‌కి అప్పగిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ వర్గాలు బుధవారం వెల్లడించాయి. CRPF, NSG విధుల్లో చేసిన మార్పులు నెలరోజుల్లో పూర్తి అవుతాయని కేంద్రం తెలిపింది.